calender_icon.png 30 October, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి

30-10-2025 05:15:38 PM

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు తడిసినా ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు, గురువారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మోంత తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా  మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు, అలాగే పోయిన ఏసంగీ సన్న వడ్లకు  బోనసిస్తానని మాయమాటలు చెప్పి రైతులను మోసం చేశారని, ఇప్పటికైనా చెప్పిన విధంగా రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వాలని అన్నారు... ఈ కార్యక్రమంలో  గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, మాజీ సర్పంచ్లు రాజమల్లయ్య, రాజు, నాయకులు పాల రామారావు, సూర శ్యామ్, మనోజ్ గౌడ్, గొట్టం మహేష్ , సంపత్ , సతీష్, అరుణ్ , కనకం శంకర్, దయాకర్, ఎండి, రఫీక్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.