calender_icon.png 30 October, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఆరబోసిన ధాన్యం ఎత్తిపోస్తున్న వర్షపు నీరు

30-10-2025 05:39:24 PM

తడిసి ముద్దయిన ఆరుగాలం కష్టం..

రైతుల నిండా ముంచిన అకాల వర్షం..

బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మొంథా తుఫాన్ తో రైతులు పండించిన ధాన్యం ఆరుగాలం శ్రమ తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం ఉదయం వరకు అకాల వర్షం పడడంతో రైతులు పండించిన ధాన్యం కల్లాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయింది. అదేవిధంగా మరో కొంద రైతులు ఇంకా వరి పంట కోయక పోవడంతో అకాల వర్షంతో నేలపాలయింది. అదేవిధంగా తెల్ల బంగారం(పత్తి) కూడా రైతుల చేలల్లో తడిసి ముద్దయింది.

రైతులు గురువారం ఉదయం నుంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై నిలిచిన నీళ్లను ఎత్తిపోస్తున్నారు. అనంతరం తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ప్రభుత్వం అధికారులు తడిసిన ధాన్యాన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. ఏవో ప్రణీత ఏఈఓ లతో వరి పత్తి పంటలను పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక పంపినట్లు ఆమె తెలిపారు.