calender_icon.png 23 October, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం

23-10-2025 01:01:17 AM

మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనలు ఘనంగా ఉన్నాయి.. ఆచరణ మాత్రం శూన్యంగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. చిరు ఉద్యోగుల శ్రమను, కష్టాన్ని గౌరవించడం మీకు చేత కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు స్పందించారు.

కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కోసం, స్కావెంజర్ల వంటి చిరు ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పేద విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకం నిధులు సైతం ఏడాదిగా పెండింగ్‌లో పెట్టారని, కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న మీకు.. మీ సొంత శాఖలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతన సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.