calender_icon.png 26 August, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన తండాలలో ‘తీజ్’ వేడుకలు

26-08-2025 01:25:48 AM

కుభీర్, ఆగస్టు 25: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రంజిని తాండలో బంజారా ల సాంప్రదాయ వేడుకగా తీజ్ పండుగను తాండా వాసులు కలిసి ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా భాద్రపద మాసం మొద టి వారంలో తట్ట బుట్టలలో నవధాన్యాలను మొలకెత్తించి ఎన్ని రోజులు పాటు నీళ్లు పోసి తొమ్మిదవ రోజున భక్తి సిద్ధార్థ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని గిరిజనులు తెలిపారు.

తమకు మంచి వరుడు దొరకాలని యువతులు తొమ్మిది రోజులపాటు ఉపవాసాలు ఉండి తండాలోని దుర్గాదేవి సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయాంలో బుట్టలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో తండా నాయక్ జాదవ్ సాహెబ్ రావు, గులాబ్ నాయక్, రాథోడ్ హరిలాల్, జాదవ్ కిషన్, తండా గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.