29-12-2025 02:24:55 AM
ఒకరి చెక్కు మరొకరు డ్రా?
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
మహబూబాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): గుండె జబ్బుకు చికిత్స చేయిం చుకుని ఆర్థికంగా చితికిపోయిన ఓ నిరుపేద దళితుడు ముఖ్యమంత్రి సహాయ నిధి కో సం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం అతడికి ఆర్థిక సహాయం అందించిన రూ.51 వేల చెక్కు గల్లంతైన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లిలో చోటుచేసుకుంది. కొప్పుల శ్రీనివాస్‌కు 2023 ఆగ స్టులో గుండెనొప్పి రావడంతో ఖమ్మం నగరంలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఇందుకు రూ.1,84,271 బిల్లు ఆసుపత్రికి చెల్లించాడు.
ఆర్థికంగా ఇబ్బంది తలెత్తడంతో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం అప్పటి ఎమ్మె ల్సీ, మంత్రి సత్యవతి రాథోడ్‌కు తన పరిస్థితి వివరించి, పూర్తి బిల్లులు, డిశ్చార్జి కార్డుతో దరఖాస్తు సమర్పించాడు. ఇంతలో ఎన్నికలు రావడంతో తన సీఎంఆర్‌ఎఫ్ సహా యం విషయాన్ని కొద్దికాలం పాటు పక్కనపెట్టి ఇటీవల కొత్తగా ప్రభుత్వం ఏర్పడ డంతో సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తు విషయంపై వాకబు చేశాడు. అయినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో బాధితుడు రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి చెల్లింపు విభాగానికి వెళ్లి తన ఆధార్ కార్డు, ఇతర బిల్లులు చూపించి తన సీఎం సహాయనిధి దరఖాస్తు విషయాన్ని వివరించాడు.
దీనితో అక్కడి అధికారులు నీకు సీఎం సహాయ నిధి నుంచి 2024 సెప్టెంబర్ 23న రూ.51 వేలు మంజూరు చేసి టోకెన్ నెంబర్ 14097 ద్వారా, సీరియల్ నెంబర్ 75957/ సీఎంఆర్‌ఎఫ్/24 ప్రకారం చెక్కు నంబర్ 820857 చెల్లింపు జరిగినట్లు చెప్పా రు. ఈ విషయంపై అనేక పర్యాయాలు స్థానిక అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవ డంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు కురవి పోలీ స్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని చెప్పడంతో రెండు రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని శ్రీనివాస్ కోరుతున్నాడు. ఈ విషయంపై మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య మాట్లాడుతూ.. కొరవి ఎస్సై విచారణ జరుపుతున్నారని తెలిపారు.