29-12-2025 02:27:56 AM
ముగ్గురు యువకులు దుర్మరణం!
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఘటన
మృతులది ఒకే కుటుంబం
నారాయణఖేడ్, డిసెంబర్ 28: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ శివారులో ని కల్వర్టు గోతిలో బైక్‌పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెంది న ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అవుటి నర్సింలు(27), జిన్నా మల్లేష్ (24), జిన్నా మహేష్(23) కలిసి నారాయణఖేడ్‌లో శనివారం రాత్రి బిర్యాని తిని, తిరిగి నర్సాపూర్‌కు బైక్‌పై బయలుదేరారు.
ఈ క్రమంలో 161 (బి) నేషనల్ హైవే పను ల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు గోతి లో పడి అక్కడిక్కకడే మృతి చెందారు. రాత్రి కావడంతో విషయాన్ని ఎవరు గ్రహించలేదు. ఉదయం స్థానికులు గమనించి పోలీ సులకు సమాచారం అందించారు. పోలీసు లు చేరుకొని మృతదేహాలను వెలికి తీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతులు బావ, బామ్మరుదులు కా వడంతో వారి కుటుంబంలో తీవ్రదుఃఖాన్ని మిగిలించింది.
హైవే అధికారుల నిర్లక్ష్యం?
నిజాంపేట్ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ఖేడ్ శివారులో నిర్మిస్తున్న కల్వర్టు వద్ద సరియైన డైవర్షన్ లేకపోవడంతో పాటు, ప్రమాద హెచ్చరిక బోర్డు సూచికలు ఏర్పాటు చేయలేదు. ఇదే ప్రమాదానికి కారణమని స్థానికులు హైవే నిర్మాణ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంపేట్ నుంచి బీదర్ వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే రోడ్డు పనుల్లో పూర్తిగా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తూ ఉండటంతో తరుచుగా ఇలాంటి ప్రమాదాలు చో టు చేసుకుంటున్నాయని చెపుతున్నారు. సం బంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, మృతతు కుటుంబాలకు న్యా యం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.