16-08-2025 12:21:19 AM
దౌల్తాబాద్,(విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.