16-08-2025 12:19:49 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): ప్రేమ, పెళ్లి పేరుతో యువ తులనను మోసం చేసి, మత మార్పిడులకు పాల్పడుతున్న పాకిస్థానీ యువకుడి బాగో తం హైదరాబాద్‌లో బట్టబయలైంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని, మతం మార్చిన భర్త ఫహద్.. మరో మహిళతో సన్నిహితంగా ఉం డగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌంట్ బంజారా కాలనీలో వెలుగుచూసింది.
బాధితురాలి ఫిర్యా దు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఫహద్(36) 1998లో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. హైటెక్ సిటీలోని సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అతనికి కీర్తి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో, 2016 మార్చిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఫహద్..
కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు. వీరిద్దరూ బంజారా హిల్స్ లోని మౌంట్ బంజా రా కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి ఒక కూతురు ఉంది. అయితే, ఇటీవల ఫహ ద్ తాను పనిచేస్తున్న కంపెనీలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. శుక్రవారం ఆ ఇద్దరినీ కీర్తి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, పోలీసు లకు సమాచారం అందించింది. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫహద్‌ను, అతనితో ఉన్న మరో మహిళను స్టేషన్‌కు తరలించారు.
పాకిస్థానీ అనే విషయం దాచిపెట్టాడు
ఈ ఘటనపై బాధితురాలు కీర్తి మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైంది. పాకిస్థానీ అనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుని, బలవంతంగా మతం మార్చాడని చెప్పింది. అదనపు కట్నం తేవాలంటూ ని త్యం కొట్టేవాడని వాపోయింది. తన కూ తురిని కూడా బలవంతంగా మతం మార్చా డని చెప్పింది. తన పేరు మీద రూ.20 లక్షల లోన్ తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పోలీసులు జరిపిన తనిఖీల తర్వాతే అతడు పాకిస్థానీ అని తనకు తెలిసిందని తెలిపింది. కాగా పోలీసుల ప్రాథమిక విచారణలో ఫహద్ అమ్మాయిలను ప్రేమ పేరు తో వలవేసి, పెళ్లి చేసుకుని, మతం మార్చి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫహద్ పాస్‌పోర్ట్, వీసా వివరాలతో పాటు, గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.