calender_icon.png 13 October, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు అండదండగా సీఎంఆర్ఎఫ్

13-10-2025 06:45:30 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): బాధితులకు అండదండగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందుతున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్ తెలిపారు. సోమవారం బోయినపల్లి మండలం జగ్గారావు పల్లిలో ఐదుగురు బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనారోగ్యానికి గురైన బాధితులు ప్రమాదాల్లో గాయపడిన వారు ఎవరు ఆందోళనకు గురి కావద్దని బాధితులకు ప్రభుత్వం బాసర ఉంటుందని ఆయన చెప్పారు. చికిత్స అనంతరం అందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆన్ లైన్ చేసి ఫైల్ పంపిస్తే ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డి, మండల గ్రామ నాయకులు ఉన్నారు.