13-01-2026 01:24:58 AM
నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు
నిర్మల్, జనవరి ౧౨ (విజయక్రాంతి): సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం నియోజక వర్గంలోని 78 మంది లబ్ధిదారులకు రూ. 33.79 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్స చేసు కోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు అబ్దుల్ హాజీ, సోమ భీమ్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్‌రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.