calender_icon.png 13 January, 2026 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

13-01-2026 01:23:35 AM

నిర్మల్, జనవరి ౧౨ (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి తాహెర్‌బిన్ ఆమ్దాని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీఎం సభ కోసం స్థలాన్ని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావుతో కలిసి సోమవారం పరిశీలించారు. మామడ మండలం పొన్కల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజ్ ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని వివరించారు. ఇందులో జిల్లా ఇన్చార్జులు చంద్రశేఖర్ గౌడ్, రామ్ భూపాల్, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి తదితరులున్నారు.