09-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, అక్టోబర్ 8 :ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన గోనె ఉమారాణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉమారాణి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్‌ఓసి మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్‌ఓసి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు కుమార్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మంద బాల్ రెడ్డి పాల్గొన్నారు.