09-10-2025 12:00:00 AM
-హత్యా..? ఆత్మహత్యా..?
- తెరపైకి కీలక ప్రశ్నలు
- కొనసాగుతున్న పోలీసుల విచారణ
హుస్నాబాద్, సెప్టెంబర్ 8:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని జిల్లెల్లగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి సనాదుల వివేక్ (13) అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు వేగవం తమైంది. క్లాస్ రూమ్ కారిడార్లో నైలాన్ దా రం మెడకు బిగుసుకుని వివేక్ మరణించిన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో లోతు గా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో ఉపాధ్యాయులు చెప్పిన వాదనల్లో ని వైరుధ్యాలు, వివేక్ తండ్రి ఆరోపణలు, సంఘటనా స్థలం పరిస్థితులు అనేక కీలక ప్ర శ్నలను తెరపైకి తెస్తున్నాయి.
క్లాస్ రూమ్ కారిడార్లో నైలాన్ దారం కట్టి ఉండటంపై పో లీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ దారం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు దా న్ని కారిడార్లో కట్టారు? దాన్ని దేనికోసం ఉపయోగించారు? ప్రమాదవశాత్తు జరిగింది అనడానికి బదులు, దారం మెడకు చుట్టుకు ని ఉరి బిగుసుకునేంత ఎత్తులో ఉందా? అ నే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ వివరాలు మరణానికి గల కారణాన్ని నిర్ధారించడంలో కీలకం కానున్నాయి.
తోటి విద్యార్థి పాత్రపై విచారణ
వివేక్ను వాష్రూమ్కు రమ్మని బలవంతం చేసి, అతడు వెళ్లనని చెప్పడంతో వాష్రూ మ్కు వెళ్లిన ఆ తోటి విద్యార్థిని పోలీసులు వి చారిస్తున్నారు. ఆ విద్యార్థి తిరిగొచ్చేసరికే వివేక్ నిర్జీవంగా పడి ఉండటం అనుమానాలను పెంచుతోంది. వివేక్ ఆత్మహత్య చేసుకు న్నాడా? లేక ప్రమాదవశాత్తు మరణించా డా? అనే కోణంలో ఆ విద్యార్థి వాంగ్మూలం కీలక ఆధారం కానుంది. ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే, కేవలం వాష్రూమ్కు వెళ్లి వ చ్చే కొద్ది నిమిషాల్లోనే ఒక బాలుడు ఉరి వే సుకోవడం సాధ్యమేనా? వివ్పే ఎవరైనా ఒ త్తిడి తెచ్చారా? అనేది పోలీసులు పరిశీలిస్తున్నారు.
అత్యంత పర్యవేక్షణలో ఉండాల్సిన గురుకులంలో క్లాస్ రూమ్ కారిడార్లోనే వి ద్యార్థి మృతి చెందడం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ఘోర నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. గురుకులం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందా? అనే విషయాన్ని కూడా పోలీ సులు పరిశీలిస్తున్నారు. ‘కింద పడ్డాడు, గా యాలయ్యాయి‘ అని మాత్రమే ఉపాధ్యాయులు ఫోన్లో చెప్పారని, కానీ ఆసుపత్రికి వె ళ్లేసరికి మెడకు తాడు బిగుసుకుని ఉన్న స్థితిలో తన కొడుకు శవమై కనిపించాడని వివేక్ తండ్రి చేసిన ఆరోపణలు ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర అనుమానాలకు దారితీ స్తున్నాయి. కీలకమైన ’తాడు బిగుసుకున్న’ విషయాన్ని ఉపాధ్యాయులు ఎందు కు దా చిపెట్టడానికి ప్రయత్నించారనే ప్రశ్నకు స మాధానం దొరకాల్సి ఉంది.
ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై చర్యలు తప్పవా?
విద్యార్థి మరణానికి సంబంధించి ప్రాథమికంగా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయు ల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంద ని వివేక్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ధర్నా అనంతరం హుస్నాబాద్ ఏసీపీ సదానందం బాధితుల ను సముదాయించి, తక్షణమే న్యాయం చే స్తామని హామీ ఇచ్చారు.
వివేక్ మృతికి కారకులైన ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్య లు తీసుకోవాలని, కేసు విచారణను వేగవం తం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గురుకులాల్లో విద్యార్థుల భద్ర త మరోసారి ప్రశ్నార్థకంగా మారిన ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తు న్నారు. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులో కి రావాలంటే, పోస్టుమార్టం నివేదిక, సంఘటన జరిగిన ప్రదేశంలోని ఆధారాలు, తోటి విద్యార్థుల వాంగ్మూలాల మధ్య పొంతన కీలకం కానుంది.