11-09-2025 12:43:17 AM
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వివిధ కారణాలతో అనారోగ్యాల పాలు చికిత్స పొందుతున్న నియోజకవర్గంలోని 116 మంది లబ్ధిదారులకు బుధవారం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరి అయిన చెక్కులు పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.