11-09-2025 12:42:06 AM
దేవరకొండ, సెప్టెంబర్ 10: పిఎ పల్లి మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే బాలు నాయక్ వివిధ కాలనీలో పర్యటించి, గ్రామ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అక్కడిక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరంవారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం, తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.రైతు రుణమాఫీ , రైతు భరోసా , రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి స్పందన ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.