29-01-2026 01:22:46 AM
కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం ఉమ్మడి జిల్లాలలో ఫిబ్రవరి 3 నుంచి 8వ తేదీ వరకు ఒక బహిరంగ సభ చొప్పున నిర్వహించనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రా నికి ఫిబ్రవరి 2న రానున్నారు. మరుసటి రోజు నుంచే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల బాట పట్టనున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సభతో ప్రచార సభ ప్రారంభం కానుంది. 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజాబాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార సభలు నిర్వహించనున్నారు. కాగా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సభలు నిర్వహించిన విషయం తెలిసిందే.
వరంగల్ జిల్లా మేడారంలో కూడా సభ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిపించుకునేందుకు సభలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఉమ్మడి జిల్లాల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పేరుతో పట్టణాల్లో సభలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పార్టీ అభ్యర్థు లను గెలిపించుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగుతున్నారు.