29-01-2026 01:22:35 AM
కళాశాల స్థాయిలోనే కెరీర్ గైడెన్స్ : సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఉన్నత విద్యా సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలల్లో బోధన చేసి రిటైర్డ్ అ యిన మంచి అనుభవం కలిగిన ఫ్రోపెసర్స్, లెక్చరర్స్, టీచర్స్‌తో విద్యార్థులకు తరచూ మూఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి, బోధన చేయించాలని సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖపై ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎస్ రామ కృష్ణారావు మాట్లాడుతూ.. విద్యా సంస్థలలో బోధనలో నాణ్యతాప్రమాణాలు మరింతగా పెంచాలని ఆదేశించారు. సమావేశంలో వి ద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్‌బోర్డుకార్యదర్శి కష్ణఆదిత్య, ఐటీ ప్ర త్యేకకార్యదర్శి భవేష్‌మిశ్రా, పాఠశాల విద్యా సంచాలకులు నవీన్‌నికోలస్ పాల్గొన్నారు.