calender_icon.png 26 July, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదట జరిమానా! రెండోసారి పట్టుబడితే జైలుకే!

25-07-2025 02:34:27 AM

  1. పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
  2. మద్యం సేవించి పట్టుబడిన ముగ్గురికి జైలు

మేడ్చల్ అర్బన్, జూలై 24:మద్యం సేవిం చి ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడితే జైలుకు వెళ్లడం తప్పదా అంటే అవున నే అంటున్నాయి తాజాగా వెలువడిన డ్రంక్ అండ్ డ్రైవ్ తీర్పులు. మద్యం సేవించి వాహనాన్ని నడపడం వలన జరిగే నష్టాలను ట్రా ఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వాహనదారులకు చెబుతూనే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రై వ్ చేసి వాహనాన్ని నడపవద్దని పోలీసులు ఎన్నో క్యాంపెయిన్లు చేపడుతుంటారు.

కానీ కొందరు మాత్రం ఏమవుతుందిలే అని మద్యం సేవించి ప్రమాదాల బారిన పడటమే కాకుండా, అమాయకుల ప్రాణాలు బ లి తీసుకున్న ఘటనలు ఎప్పటికప్పడు వింటూనే ఉంటాం. మద్యం సేవించి తనిఖీ ల్లో పట్టుబడిన వారిని కౌన్సిలింగ్ కు పంపించినా మందుబాబులు మాత్రం మద్యం సే వించి వాహనాన్ని నడపటం ఆపడం లేదు.

గత వారంలో మద్యం సేవించి పట్టుబడిన ఇద్దరిని నాలుగు రోజులపాటు జైలు శిక్ష విధి స్తూ అత్వెల్లి ఏడవ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి తీర్పునివ్వగా తాజాగా మద్యం సేవిం చి పట్టుబడిన మరో వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్షను బుధవారం విధించారు.

కట్టుదిట్టంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 

గ్రేటర్ హైదరాబాద్ సహా మేడ్చల్ జిల్లా పరిధిలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కట్టుదిట్టంగా చేపడుతూన్నారు. వారాంతపు చివరి రోజుల్లో రోడ్ల పై పూర్తిస్థాయిలో పోలీసు అధికారులు డ్రం క్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి ఒక్కో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10ల సంఖ్యలో కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నా రు. మొదటిసారి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే తరహాలో మద్యం సేవించి రెండోసారి తనిఖీల్లో పట్టుబడితే జైలుకు వెళ్తున్నారు.

తాగి వాహనం నడపకండి: సీఐ హనుమాన్ గౌడ్ 

మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఎన్నో అనర్ధాలు జరిగే అవకాశం ఉం టుందని మేడ్చల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమాన్ గౌడ్ తెలిపారు. మద్యం సేవించిన సమయంలో వాహనంతో రోడ్ ఎక్కితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా క్షేమంగా గమ్యా న్ని చేరుకోవచ్చని తెలిపారు.