calender_icon.png 1 August, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కోర్టు భవనానికి భూమి కేటాయింపు

31-07-2025 08:26:15 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అధికారులు కేటాయించారు. సారంగాపూర్ మండలంలోని చించోలి.బి గ్రామ శివారులో 6.32 ఎకరాల భూమిని కోర్టు భవన నిర్మాణానికి కేటాయించారు. గురువారం ఈ స్థలాన్ని రెవెన్యూ, న్యాయ శాఖాధికారులు కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాధిక, ఆర్డీఓ రత్నాకళ్యాణి, తహసిల్దార్ శ్రీదేవి, ఇతర న్యాయ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.