20-07-2024 11:38:03 AM
జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి కేటీకే 2, కేటీకే 3 ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో 4 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మలహర్ రావు మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఓసి అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షపాతం మరింత ఉధృతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.