calender_icon.png 8 August, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బౌరంపేట రోడ్లకు నిరసనగా మహిళల వరి నాట్లు

20-07-2024 12:32:47 PM

 మున్సిపల్ కమిషనర్ కు అవగాహన లేదంటూ  గ్రామస్తుల ఆగ్రహం

దుండిగల్ మున్సిపాలిటీ పాలకుల నిర్లక్ష్యం... పరేషాన్ల ప్రజలు...

బౌరంపేట : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట అధ్వానంగా మారిన రోడ్లపై ప్రజలు మండిపడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గుంతల మయంగా ఉన్న రోడ్డు వలన ఇబ్బంది పడుతున్న మహిళలు గుంతల్లో వరి నాట్లు వేసి మున్సిపల్ కమిషనర్, పనితీరు, పాలకుల పనితీరుపై  నిరసన తెలిపారు. ఇందుకేనా మేము మీకు ఓట్లు వేసి గెలిపించుకుంది.. ఇందుకేనా మేము నెల నెల ట్యాక్స్ కట్టి మీకు వేతనాలు అందిస్తున్నాము. అంటూ ప్రజలు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. రోడ్లు బాగా లేకపోవడం వల్ల వృద్ధులు మహిళలు పిల్లలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.  వర్షాకాలంలో రోడ్డుపై ప్రయాణించేటప్పడు ఏ గుంతలున్నాయో..  ఏ గోతులు ఎక్కడ ఉన్నాయో తెలియక అవస్థలు ఎదుర్కొంటున్నామని బౌరంపేట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటి నుండి బయటకు వచ్చి అధికారులు పాలకులపై తమ నిరసన వ్యక్తం చేశారు.