calender_icon.png 18 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బంది చలిమంట కాగుతూ

18-12-2025 01:01:44 AM

మహబూబాబాద్, విజయక్రాంతి: మహబూబాబాద్ జిల్లాలో రాత్రి పూట చలి ప్రజలను గడగడ వణికిస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 13 నుంచి 14 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహణలో భాగస్వాములైన అధికారులు సిబ్బందిపై చలి ప్రతాపాన్ని చూపింది. కురవి మండలంలో బుధవారం ఉదయం చలి తీవ్రత అధికంగా ఉండటంతో పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బంది చలిమంట కాగుతూ కనిపించారు.