calender_icon.png 22 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలి.. పంజా విసురుతోంది

22-11-2025 02:19:29 AM

- పెరిగిన చలి తీవ్రత

- చిన్నపిల్లలు వృద్ధులపై చలి ప్రభావం

- రోగాల బారిన పడుతున్న ప్రజలు. 

- అన్ని రంగాలపై చలి ప్రభావం.

- ఉన్ని దుస్తులకు పెరిగిన డిమాండ్

మండలంలో చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతున్నది. గ్రామాలు చలికి వణికి పోతున్నాయి. చలి ప్రభావంతో చిన్న పిల్లలు వృద్దులు, ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినాయి. పగలు వేళనే చలి ప్రభావం కనిపిస్తోంది. చలి ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తోంది. దీనితో ప్రజలు మార్కెట్లకు వెళ్లి ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. దీనితో ఉన్ని దుస్తుల కు డిమాండ్ పెరిగింది.

ఎర్రుపాలెం నవంబర్ 21 ( విజయ క్రాంతి):పెరిగిన చలి గాలులు. మండలంలోని అన్ని గ్రామాలలో చలి పంజా విసురు తోంది. దీనితో గ్రామాలు గజగజ వణుకుతున్నాయి. చలి గాలుల ప్రభావంతో ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. మండలంలో ప్రజలు, చిన్నపిల్లలు వృద్ధులు పై చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం.తీవ్ర చలిగాలుల వలన పగటి ఉష్ణోగ్రతలు మండలంలో గణనీయంగా పడిపోయినాయి. దీనితో పగలే చలిగాలులతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఐదు గంటల దాటిన తర్వాత చీకట్లు అలుముకుంటున్నాయి . ప్రజలు సాయంత్రం ఆరు తర్వాత గ్రామాలలో అలజడి పూర్తిగా తగ్గిపోయినది. గ్రామాలలో వీధుల నిర్మానుషంగా కనబడుతున్నాయి. ప్రజలు ఉదయాన్నే చలిమంటలు తో గ్రామాలలో వేసుకోవడం కనిపిస్తోంది. 

అన్ని రంగాలపై చలి ప్రభావం 

తీవ్ర చలి దాదాపు అన్ని రంగాలపై ప్రభావం కనిపిస్తోంది . బిపి, షుగర్ , థైరాయిడ్ వంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. అనేకమంది జ్వరాలు పాలు అవుతున్నారు. ప్రజలనుత్యం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.ప్రజలు ఉదయాన్నే చేయవలసిన పనులన్నీ పక్కన పెట్టడంతో గ్రామాల పై దీని ప్రభావం కనిపిస్తోంది. వ్యవసాయదారులు, కార్మికులు, శ్రామికులు, ఉదయాన్నే తమ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారిపై, ఉద్యోగస్తులపై, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులపై, ట్రాన్స్పోర్ట్ రంగంపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

ఉన్ని దుస్తులకు పెరిగిన డిమాండ్

మండల వ్యాప్తంగా చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు మార్కెట్ల వైపు పరుగులు తీస్తూ తమ శరీర ఉష్ణోగ్రతలను పెంచుకునేందుకు, చలి ప్రభావం నుండి కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. దీనితో ఉన్ని దుస్తులకు డిమాండు మరింత పెరిగింది.