22-11-2025 02:15:59 AM
సీఐటీయూ
ఎర్రుపాలెం నవంబర్ 21 ( విజయ క్రాంతి) : సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU) ఎర్రుపాలెం మండల మహాసభ శుక్రవారం నాడు అమరజీవి కామ్రేడ్ సగ్గుర్తి సంజీవరావు నగర్ కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనం నందు జరిగినది. కామ్రేడ్ సగ్గుర్తి సంజీవరావు చిత్రపటానికి జిల్లా రైతు సంఘం నాయకులు దివ్వెల వీరయ్య పూలమాలవేసి నివాళులు అర్పించారు. మండల సీఐటీయూ నాయకులు చిత్తరు కిషోర్,గంతల నాగేశ్వరావు,బుజ్జమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర కమిటి శీలం నరసింహారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ కేంద్ర బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం వలన కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం వలన కార్మికులు స్వాతంత్రం పూర్వం నుండి అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ చట్టలు 29 రకాల కార్మికుల హక్కుల రక్షణ కోసం చేసినటువంటి చట్టాలను రద్దు చేసి పెట్టుబడుదారుల మెప్పు కోసo బిజెపి మోడీ ప్రభుత్వం నాలుగు కోడ్ లను తయారు చేయడం దుర్మార్గమన్నారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు,రైతులు,కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించలన్నారు ఈ మహాసభ ప్రారంభ సూచికగా ఆశ వర్కర్ యూనియన్ కార్యదర్శి నండ్రు సుధారాణి జెండా విష్కరించారు.అనంతరం ఈ మహాసభలో సిఐటియు మండల కమిటీ ఏకగ్రీవంగా సీఐటీయూ మండల కన్వీనర్ మద్దాల ప్రభాకర్ కో కన్వీనర్ దుదిగం బసవయ్య ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ మహాసభలో సగ్గుర్థి వెంకట కృష్ణ, నక్క పుల్లయ్య,దుదిగం శ్రీను,సిఐటియు వివిధ అనుబంధ రంగాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.