22-11-2025 02:17:41 AM
కలెక్టర్ మార్గదర్శకత్వంలో..
భద్రాద్రి నవంబర్ 21 విజయ క్రాంతి జిల్లా విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాం డ్బుక్ను శాస్త్రీయ ఆధారాలతో, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా రూ పొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటి ల్ సూచించిన దిశలో, ఇండియా హౌస్ ప్రతినిధి బృందం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృత స్థాయి క్షేత్ర పర్యట న నిర్వహించింది. జాహ్నవి, సోనల్ ఘోడ్గే, మురళి (డిప్యూటీ కలెక్టర్) లతో కూడిన ఈ బృందం సహజ వనరులు, పర్యావరణ వ్యవస్థ, అడవి సంరక్షణ, పరిశ్రమల ప్రభా వం, వాతావరణ మార్పుల నేపథ్యం వంటి అంశాలను పరిశీలిస్తూ పలు ప్రాంతాలలో ప్రత్యక్ష సమాచారం సేకరించింది.
పర్యటనలో భాగంగా ముందుగా సింగరేణి ఆధ్వ ర్యంలో నడుస్తున్న నర్సరీలను సందర్శించిన బృందం, గనుల తవ్వకాల వల్ల కోల్పోయిన అడవులను పునరుద్ధరించేందుకు చేపడుతున్న పునర్వనీకరణ చర్యలు, శాస్త్రీయ పద్ధ తుల్లో పెంచుతున్న వివిధ జాతుల మొక్కలు, పునరావాసం చేసిన గనుల ప్రాంతాల్లో అమలు చేస్తున్న జీవవైవిధ్యం సంరక్షణ కార్యక్రమాలపై అధికారులు ఇచ్చిన వివరాలను సమగ్రంగా పరిశీలించింది. పర్యావర ణ పరిరక్షణ చర్యలలో సింగరేణి సంస్థ చేపడుతున్న నాణ్యతా ప్రమాణాలను కూడా బృందం అధ్యయనం చేసింది.తదుపరి కిన్నెరసాని అభయారణ్యం మరియు కిన్నెరసాని డ్యామ్ను సందర్శించిన బృందం, అభయారణ్యంలో అరుదైన వృక్షజాతులు, జంతువు లు, అడవి సంరక్షణ పథకాలు, అడవుల నరికివేత వల్ల వాతావరణ మార్పులపై పడుతు న్న ప్రభావం వంటి అంశాలను అటవీ అధికారులు వివరించారు.
కిన్నెరసాని డ్యామ్ వద్ద నీటి నిల్వలు, వరద నియంత్రణ వ్యవ స్థ, జలవనరుల నిర్వహణ విధానాలు మరి యు డ్యామ్ భద్రతా ప్రమాణాలను బృం దం సమీక్షించింది.అటవీ శాఖ అధికారి కృ ష్ణగౌడ్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో అడవుల ప్రస్తుత స్థితి, అక్రమ వృక్ష నరికివేత నియంత్రణ చర్యలు, వాతావరణ మార్పులతో సంభవించే సహజ విపత్తుల ప్రభావం, వరదలు మరియు నేల ధూపాన్ని నిరోధించేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.మాదారం గ్రామంలోని నాయకపొడు మాస్క్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా, మాస్క్ తయారీలో వినియోగించే చెక్క మూలాలు, వాటి వల్ల అడవులపై పడే ప్రభావం, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల అమలు వంటి అంశాలను బృందం సమీక్షించింది.
అనంతరం దమ్మపేటలోని ఆయిల్ పామ్ పరిశ్రమను సందర్శించి, ఉత్పత్తి విధానాలు, పరిశ్రమ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ చర్యలపై అధికారులు అందించిన వివరాలను అధ్యయనం చేశారు. రోజంతా సాగిన ఈ విస్తృత క్షేత్ర అధ్యయనంలో బృందం జిల్లాలోని సహజ వనరు లు, అటవి వ్యవస్థ, పరిశ్రమల పర్యావరణ ప్రభావం, గ్రామీణ జీవన విధానాలు వంటి పలు కీలక రంగాలపై వివరాలను సేకరించింది. ఈ సమాచారం మొత్తం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకంలో రూపుదిద్దుకుంటున్న జిల్లా విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్బుక్ తయారీలో ప్రధాన ఆధారాలుగా ఉపయోగించబడనున్నాయని అధికారులు తెలిపారు.ఈ పర్యటనలో సం బంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.