calender_icon.png 22 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు

22-11-2025 02:21:11 AM

  1. సెల్లార్లను వదలని వ్యాపారులు
  2. తూతూ మంత్రంగా అధికారుల నోటీసులు

ఖమ్మం, నవంబరు 21 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్లాన్ ఒక టి తీసుకుంటే కట్టేది మరొకటి అవుతుంది అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా డొమెస్టిక్, కమర్షియల్ అని తేడా లేకుండా ఇష్టానుసారంగా భవన నిర్మాణదారులు బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇక వైరా రోడ్, నెహ్రు నగర్, నిజాంపేట, వీడియోస్ కాలనీ, బ్యాంకు కాలనీ, ఇల్లందు రోడ్డు, కవి రాజ్ నగర్, శ్రీరామ్ నగర్, శ్రీనగర్, రాపర్తి నగర్, శ్రీనివాస్ నగర్, వంటి ప్రదేశాల్లో కు ప్పలు తెప్పలుగా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కట్టుకుంటూ రోడ్లను ఆక్రమిస్తుండడం సర్వసాధారణంగా మారింది. భవన నిర్మాణదారులు సిటిజన్ పోర్టల్ లో ఆన్లైన్ పద్ధతి ద్వారా ఇంటి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టడం వల్ల అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. 

 రాజకీయ జోక్యంతో.. 

నగరం దిన దిన అభివృద్ధి చెందుతోంది. పట్టణంలోని ప్రతి మూల షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు లెక్కకు మించి వెళుతున్నాయి. అయితే ఇవేవీ నిబంధనలు పాటించడం లేదని అనుమానాలు ఉన్నాయి. నగరంలో ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మాణాల వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  అయితే ఇలాంటి అక్రమ నిర్మాణాలను అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నా రన్న విమర్శలు ఉన్నాయి.

అసలే పట్టించుకోకపోతే అధికారులు ఉన్నారా? లేదా? అనే అనుమానం వస్తుందన్న భావనతో కొండకోచో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తు న్నారు. అధికారులు అలా నోటీసులు ఇవ్వగానే రాజకీయ నాయకుల నుంచి ఫోను రా వడం పరిపాటిగా మారింది. ఫలానా షా పింగ్ మాల్ మన వాళ్ళదే ఆ హాస్పిటల్ మన వర్గం వారిదే వాటి గురించి పెద్దగా ప ట్టించుకోవద్దని అధికారులకు నాయకులు చెబుతున్నట్లు సమాచారం.

దీంతో అధికారులు కేవలం నోటీసులు ఇచ్చామని చెప్పు కోవడానికి మాత్రమే తమ అధికారాన్ని ప్రయోగిస్తున్నారు. వెరసి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడకపోగా నగరంలో రోజురో జుకీ మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

కాస్త ఖాళీ కూడా వదలకుండా.. 

 బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టేటప్పుడు సెల్లార్లను ఖాళీగా ఉధరాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే నగరంలో ఏ కమర్షియల్ బహుళ అంతస్తులను చూసి న సెల్లార్ అనేది కనిపించదు. సెల్లార్లను కార్యాలయాల నిర్వహణ, ల్యాబ్ లు, ఆహార కేంద్రాలు, షాపింగ్ సెటర్లు, టూ వీలర్ షోరూం లా మెకానిక్ షెడ్ల వంటి వాటికి అ ద్దెలకు ఇస్తూ వ్యాపారులు తమ జేబులో నింపుకుంటున్నారు. దీంతో ఆయా పనుల కోసం సంబంధిత బహుళ అంతస్తులకు వచ్చే వారు తమ వాహనాలు సెల్లార్లు పెట్టుకునే అవకాశం లేకుండా పోతోంది.

దీనివల్ల వ్యాపార సముదాయం ఉన్న ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలు నిలుపుకునే పరిస్థితి రావడంతో విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. నగరంలోని ముఖ్య రోడ్లలో ఫుట్ పాతులు అనేవి కనిపించకుండా పోయాయి. పెద్ద పెద్ద ఆసుపత్రులు సైతం సొంత కార్యకలాపాల కోసం సెల్లార్లను ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ సమ స్యలు ఎదురవుతున్నాయి. ప్రధాన రహదారుల వెంబడి నిర్మిస్తున్న భవన యజమా నులు సెట్ బ్యాక్ వదలకుండా రోడ్లను ఆక్రమిస్తున్నారు.

ఇదేమని ప్రశ్నించిన వారిని ఆయా భవన యజమానులు బెదిరిస్తూ మార్కెట్ విలువ గలిగిన స్థలాలను ఎలా వదులుకుంటామని అయినా అన్ని భవనాలు నిబంధనల ప్రకారమే కట్టుకుంటు న్నారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.  అధికారులు ఇప్పటికైనా ఇలాంటి నిర్మాణాల వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

ప్రతిదీ ఫిర్యాదు చేయాలా..? 

కొన్ని భవనాల విషయంలో కొంతమం ది లైసెన్స్ ఎల్టీపి లు తప్పుడు పనులకు పాల్పడుతూ భవన యజమానులను సమస్యల వలయంలో కి నెట్టేస్తున్నట్లు తెలుస్తోం ది. అనుభవం లేని లైసెన్సు లేని ప్లానర్లతో భవన అవగాహన లేని భవన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. వీటి పైన అవగాహన కలిగించాల్సిన అధికారులు ఏ మి పట్టించుకోవడం లేదు. అంతా అయిపోయాక ఎవరైనా ఫిర్యాదు చేస్తే గాని అధి కారులు చలనం కలగడం లేదు.

అసలు పట్టణంలో ఏ యే నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి? వేటికి లేవు? అని పట్టించుకునే తీరిక లేకుండా సంబంధిత అధికారులు వ్య వహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తే తప్ప టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోరా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి అక్రమ నిర్మాణాలపై, సెల్లార్ల వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

* దృష్టి సారిస్తారా..?

ఖమ్మం నగరంలో అడ్డగోలుగా కడుతు న్న నిర్మాణాలపై చర్యలు తీసుకునే దిశగా అధికారులు చర్యలకు పునుకుంటునట్లు తె లుస్తోంది. అయితే కొన్ని కమర్షియల్ ప్రాం తాల్లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నామని పన్ను మినహాయింపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని సమాచారం. .పెద్ద పెద్ద భవనాలకు, ఆసుపత్రులకు,హోటళ్లకు,షా పింగ్ మాల్స్ కు,షోరూం లకు కూడా నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్నుల్లో తప్పులు చేసినట్లుగా విమర్శలు వినపడుతున్నాయి.పెద్ద భవనాలకు సైతం వందల రూపాయల్లో రావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వీటిపై అధికారులు దృష్టి సారిస్తేనే నగరపాలక సంస్థ కు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడుతుందని ప్రజా సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధంగా తప్పుడు పనులకు పాల్పడ్డ వారిని గుర్తించి నోటీసులతో సరిపెట్టకుండా వెళ్లలో పెనాల్టీ వేస్తే తప్ప మరో సారి అక్రమ నిర్మాణ దారులకు కళ్లెం వేసే అవకాశం లేకపోలేదని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.