06-12-2025 12:32:22 AM
అలంపూర్, డిసెంబర్ 5: ఇటిక్యాల మండల కేంద్రం నుంచి మునగాలకు వెళ్లే దారిలో ఉన్న పిజెపి ప్రాజెక్టు కుడి కాలువ వంతెన కూలిపోయింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగి ఉండొచ్చని స్థానికులు తెలిపారు.ఆ సమయంలో అటుగా వాహనదారులు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఆ గ్రామ పరిసర ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.
అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ వంతెనను నిర్మించడంతో ఇటీవల శిథిలావస్థకు చేరుకుందన్నారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధ ప్రాతిపాదికన వంతెనను నిర్మించాలని మునగాల, నక్కలపల్లి, కొత్త దేవరపల్లి, ప్రాంత ప్రజలు కోరుతున్నారు.కాగా అధికారులు స్పందించి అటువైపు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని మునగాల నక్కలపల్లి గ్రామాల ప్రజలు కోరుతున్నారు.