06-12-2025 12:30:22 AM
మూసాపేట, డిసెంబర్ 5: ప్రజల సహకారంతోనే సర్పంచి బడిలో ఉంటున్నానని తిమ్మాపూర్ గ్రామం సర్పంచ్ అభ్యర్థి రెడ్డి రాజు అన్నారు. శుక్రవారం 8 మంది వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సహకారంతో గతంలో చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, యువత, గ్రామ ప్రజలు అత్యధికంగా పాల్గొనడం జరిగింది.