19-12-2025 12:00:00 AM
భైంసా, డిసెంబర్ 18 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో యూడీసీ సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న భీమన్న.. కింది స్థా యి ఉద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో ఏసీబీ అధికారు లు అరెస్టు చేశారు. బాసర పీహెచ్‌సీతో పాటు తానూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ యూడీసీగా ఇన్చార్జ్ బాధ్యతలను భీమన్న నిర్వహిస్తున్నాడు.
ఆ యా కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన జిపిఎఫ్ ఎఫ్ టిఏ సరెండర్ లీవ్ బిల్లుల విషయంలో డ బ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ఉద్యోగి తనకు రావలసిన బిల్లుల కోసం యూడీసీని సంప్రదిం చగా అతను రూ.9 వేలకు బేరం కుదుర్చుకొని ఫోన్‌పేలో డబ్బులు చెల్లించిన తర్వా తనే బిల్లులు మంజూరు చేశారని బాధితు లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
దీంతో గురువారం రాత్రి బైంసా పట్టణంలో భీమన్న ఇంటిలోకి వెళ్లిన ఏసీబీ అధికారులు.. బాధితుడు ఫోన్ పేలో చెల్లించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో రికా ర్డులను పరిశీలించి అనంతరం భీమన్నను అదుపులో తీసుకున్నారు. బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి, అక్కడ ఉన్న రికార్డులు, లావాదేవీల వివరాలను సేకరించారు. అక్రమాలకు పాల్పడ్డట్టు ప్రా థమికంగా నిర్ధారించి, అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఏసీబీ అదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపారు.