calender_icon.png 20 December, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె దశ తిరిగేనా..!?

19-12-2025 12:00:00 AM

  1. సమస్యలు పాతవే.. సర్పంచులే కొత్త
  2. గ్రామాల్లో ముఖ్యంగా వేధిస్తున్న పారిశుధ్యం 
  3. పంచాయితీలకు వేదిస్తున్న నిధుల కొరత
  4. నూతన సర్పంచులకు మొదట్లోనే సవాలుగా మారనున్న పాలన
  5.   22న కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

పాపన్నపేట, డిసెంబర్ 18 : ప్రజా క్షేత్రంలో గెలిచి గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పై పల్లె ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. పాత సమస్యలతో పాటు కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యం గా పారిశుద్ధ్యం.. నీటి ఎద్దడి, వీధిలైట్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు ఇలా పలు సమస్యలు పాతవే అయినా.. కొత్త సర్పంచులు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి పరిష్కరించాలని ప్రజలు భావిస్తున్నారు.

దీనికి తోడు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన స ర్పంచుల్లో ఎక్కువమంది యువకులు, కు టుంబంలో సర్పంచులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు, విద్యావంతులు, రాజకీ యం అనుభవం ఉన్నవారే కావడంతో అభివృద్ధి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. కా గా నూతన సర్పంచులు, వార్డు సభ్యులు 22న పదవీ స్వీకారం చేయనున్న సందర్భంగా రానున్న ఐదేళ్లలో పల్లె దశ మా ర్చేలా ప్రణాళికతో ముందుకు సాగాలని కోరుతున్నారు.

 కొత్త సర్పంచులు,పాత సమస్యలు

 మెదక్ నియోజకవర్గంలోని 7 మండలాలకు కలిపి 163 పంచాయతీలు ఉన్నాయి. వీ టన్నిటికీ కొత్త పాలకవర్గాలు ఎన్నికయ్యా యి. మొన్నటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు పోటీ పడినవారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రా మాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హా మీలు గుప్పించారు. అందులో కొందరిపై నమ్మకంతో ప్రజలు వారికి ఓట్లు వేసి సర్పంచ్ పదవిని కట్టబెట్టారు.

కొన్ని నెలలుగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయా శాఖల అధికారులు గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా ఉండడంతో ఎక్కడి సమస్య లు అక్కడే దర్శనమిస్తున్నాయి. కనీసం పక్షం రోజులకు ఒకసారైనా ప్రత్యేక అధికారులు పంచాయితీలను సందర్శించిన సంఘటనలు లేవు. దీంతో పంచాయతీల్లోని సమస్య లు ఇప్పుడు కొత్త సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సవాలుగా మారనున్న పాలన..

గ్రామపంచాయతీలకు నిధుల కొరత వేధిస్తోంది. నియోజకవర్గంలో ఏ పంచాయతీ ఖాతాల్లో అభివృద్ధికి వినియోగించ డానికి నిధులు లేవు. గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంఘం నిధులు రాకపోవ డంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోయాయి. ఖజానా మొత్తం ఖాళీ కావడంతో కొత్త సర్పంచులు మొదటగా సొంత ఖర్చులను ఉపయోగించాల్సిందే. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పంచాయితీలకు నిధులు విడుదల చేసేలా కనిపించడం లేదు. దీంతో నూ తన సర్పంచులకు మొదట్లోనే పాలన సవాలుగా మారనుందని చెప్పవచ్చు.