19-12-2025 12:00:00 AM
ములకలపల్లి, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో బిఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసి గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు గురువారం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, తాళ్ళపాయి, చౌటుగూడెం, తిమ్మంపేట పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,వార్డ్ మెంబర్లు, కమలాపురం, పొగళ్ళపల్లి ఉప సర్పంచ్ లు,వార్డ్ మెంబర్లు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలం, తాటిసుబ్బన్నగూడెం గ్రామం లోని వారి నివాసంలో కలిసారు.
ఈ సందర్భంగా గెలిచిన వారందరికీ మెచ్చా శుభాకాంక్షలు తెలియజేసి వారి గెలుపుకోసం కష్టపడి పనిచేసిన నాయకులను కార్యకర్తలను అభి నందించారు. పూసుగూడెం మాజీ వార్డ్ మెంబర్ తేజవత్ దస్మా కాంగ్రెస్ పార్టీనీ వీడి మెచ్చా సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో తపస్వి సింధు, మం డల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, మండల నాయకులు ఉన్నారు.