17-07-2025 10:17:19 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ అవర్ లో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా బోధన తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ పరిసరాలు, డైనింగ్ హాల్, స్టడీ రూమ్, మరుగుదొడ్లలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వసతి గృహంలో పరిశుభ్రత పాటిస్తూ, నిత్యం శానిటేషన్ చెయ్యాలని, షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.