calender_icon.png 23 September, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ పోలీస్ అధికారుల పర్యటన

22-09-2025 10:40:54 PM

చర్ల,(విజయక్రాంతి): మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి ఏజెన్సీలో అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన  చర్ల మండలంలోని కొండెవాయి గ్రామాన్ని సోమవారం సాయంత్రం ఓ ఎస్డీ నరేందర్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్  ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతపై చర్ల మండల సిఐ ఆలం రాజు వర్మను ఆరా తీశారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కొండేవాడయి నుంచి ఎర్ర బోరు, బోధనెల్లి, చింతగుప్ప అటవీ గ్రామాల మీదుగా ద్విచక్ర వాహనంపై ప్రధాన రహదారిలోని ఆరు కొత్తగూడెం వరకు చేరుకున్నారు. వారితో పాటు ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ పాల్గొన్నారు