calender_icon.png 23 September, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుల నిరసన

22-09-2025 10:27:26 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాసరావు పై దాడి యత్నాన్ని వ్యతిరేకిస్తూ ఆసుపత్రి వైద్య బృందం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సకాలంలో వైద్యం అందించకపోవడంతో మహిళ మరణించిందని, వైద్యులు నిర్లక్ష్యం వహించారని గొడవకు దిగారు. ఆమె అనారోగ్య సమస్యలతోనే మరణించిందని, తమపై దాడులకు పాల్పడేందుకు యత్నించడం సరైన పద్ధతి కాదని వైద్యులు పేర్కొన్నారు.