22-09-2025 10:34:00 PM
ప్రత్యేక అలంకరణలతో మండపాలు
ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆదిశక్తి దుర్గా భవాని అమ్మవారు సోమవారం సాయంత్రం మండపాలలో ప్రతిష్టించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలతో భవాని మాత నవరాత్రికి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మండపాల నిర్వహకులు, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా రంగురంగుల విద్యుత్ లను, అలంకరించిన మండపాల నిర్వాహకులు అమ్మవారిని మండపాల్లో ప్రతిష్టించారు.
దుర్గ భవాని మాలలు ధరించిన భక్తులు ప్రత్యేక నిష్ఠ నియమ నిబంధనలతో అమ్మవారికి పూజలు చేయనున్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ మండలాల్లో పర్యవేక్షిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.