22-09-2025 10:20:42 PM
నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్
ఉప్పల్,(విజయక్రాంతి): నేర రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పోలీసులుకు సహకరించాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనంజయ గౌడ్ అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రహేజా విస్తస్ అపార్ట్మెంట్ లో పబ్లిక్ అవగాహనా సదసు ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ. సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలవాడకంలో జాగ్రత్త వహించాలన్నారు. అకౌంట్ ప్రైవసీ చాలా ముఖ్యమని టెలిగ్రామ్ వాట్సాప్ లో జరిగే మోసాలను ఆయన ప్రజలకు వివరించారు.
అపచిత వ్యక్తులు ఉండొచ్చే వీడియో కాల్స్ ను లిఫ్ట్ చేయకుండా ఉండడం మంచిదని ఆయన సూచించారు. సైబర్ మోసగాళ్లు ఎక్కువగా వృద్ధులు టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని కాబట్టి ఇంట్లో పెద్ద వాళ్లకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించి డిజిటల్ ట్రాన్సాక్షన్ విషయంలో వారికి అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలకు బానిసై అందమైన జీవితాన్ని అందాకారం చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు. దసరా సందర్భంగా ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులుకు సహకరించి నేరరాహిత సమాజంలో భాగస్వాములు కావాలని ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు