calender_icon.png 22 November, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరిగడ్డి వాము దగ్ధం..

09-02-2025 08:25:12 PM

రూ. 50 వేల మేర నష్టం..

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కోత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధమైంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో రైతు తమ్మినేని యాదగిరికి చెందిన వరిగడ్డి వాము పూర్తిస్థాయిలో కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.50 వేల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది.