04-07-2025 07:51:24 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్గా సేవలందించిన కొలిజేటి రోశయ్య సేవలు మరువలేనివని కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో రోశయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. రోశయ్య పరిపాలన పట్ల చూపిన శ్రద్ధ పని పట్ల నిబద్ధత ఆయన వ్యక్తిత్వానికి మారుపేరుగా నిలిచిందన్నారు.