calender_icon.png 8 October, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు

07-10-2025 12:07:34 AM

  1. కుకునూరుపల్లి పిహెచ్సీలో వైద్య సేవల పరిశీలన

ప్రజ్ఞాపూర్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పరిశీలన 

గజ్వేల్/కొండపాక, అక్టోబర్ 6: సోమవారం కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి గారు ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ప్రత్యక్షంగా సమీక్ష జరిపారు. ల్యాబ్లో జరుగుతున్న టెస్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు.రాపిడ్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

గర్భిణీ స్త్రీలకు ఎచ్‌ఐవీ, సిఫిలిస్ పరీక్షలు తప్పక నిర్వహించాలని సూచించారు. ప్రతి రోజు టెస్టుల వివరాలు, స్టాక్ వివరాలు రిజిస్టర్లో పొందుపరచాలని సూచించారు.మెడికల్ స్టోర్లో మందుల నిల్వలను పరిశీలిస్తూ కాలం చెల్లిన మందులు వాడరాదని హెచ్చరించారు. టెస్టులకు కావలసిన పరికరాలు పిహెచ్సీ లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులతో ఓర్పుగా ప్రవర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు.

రాజీవ్ రహదారి వెంబడి ఉన్న ఈ పిహెచ్సీ వద్ద 108 అంబులెన్స్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని డీఎంఅండ్డిహెచ్‌ఓకి ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. అనంతరం గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పప్పు ఆలు గడ్డ, క్యారెట్ కలిపి కూర మరియు సాంబారు బాగరా అన్నం పెడుతున్నట్లు వంట సిబ్బంది తెలపగా కూర నాణ్యత మెరుగుపరచి రుచికరంగా వండాలని సిబ్బందిని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆకుకూరలు ఎక్కువగా వాడాలని సూచించారు.

ప్రాంగణంలోని కిచెన్ గార్డెన్ ను పరిశీలిస్తూ మునగ మొక్కలు పెంచాలని కిచెన్ గార్డెన్ విస్తరించాలని ఆకుకూరలుకు మొదటి ప్రాధాన్యత నిస్తూ విద్యార్థులకు మంచి భోజనం అందించాలని ఎచ్‌ఎం నీ ఆదేశించారు. పాఠశాలలో గల ఫిజికల్ ఎడ్యుకేషన్ గదిని పరిశీలించారు. వ్యాయామం వల్ల శారీరక శ్రమ పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటారని పిల్లలకు రోజు వ్యాయామం ఒక పిరియడ్ కేటాయించాలని ఇండోర్ మరియు ఔట్ డోర్ గేమ్స్ నేర్పించి ప్రావీణ్యం కలిగిన విద్యార్థులకు పలు టోర్నమెంట్ లో పాల్గొనేలా చర్యలు ప్రోత్సహించాలని ఎచ్ ఎం మరియు వ్యాయామ ఉపాద్యాయురాలినీ ఆదేశించారు.