calender_icon.png 21 August, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామాలయ బావిని పరిశీలించిన కలెక్టర్

21-09-2024 10:10:06 AM

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రామాలయ బావిని శనివారం ఉదయం కలెక్టర్ ఆశిష్ సంగువాన్ పరిశీలించారు. ఎన్నో వందల ఏళ్ల క్రితం నాటి భావి శిథిలావస్థలో ఉండడంతో ఆ బావిని పునరుద్ధరించేందుకు కలెక్టర్ పరిశీలించారు. ప్రాచీన కట్టడం కావడంతో ఆ బావి మరమ్మతులు చేపట్టేందుకు పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయనతోపాటు ఎల్లారెడ్డి ఆర్ డి ఓ ప్రభాకర్ తాసిల్దార్ మహేందర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ హరి రాజు తదితరులు పాల్గొన్నారు.