calender_icon.png 21 August, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీని గద్దె దించితేనే ఓటు హక్కుకు రక్షణ

21-08-2025 01:50:17 AM

సీపీఐ రాష్ర్ట మహాసభలో వక్తలు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 20 (విజయక్రాంతి): కేంద్రంలో బీజేపీని, ప్రధాని మోదీ ని గద్దె దించితేనే దేశంలో ఓటు హక్కుకు రక్షణ అని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. మేడ్చల్ జిల్లాలోని గాజుల రామారంలో మూడు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ర్ట 4వ మహాసభను బుధవారం ప్రారంభించారు. ఈ సందరర్భంగా సీపీఐ ప్రధాన కా ర్యదర్శి డీ రాజా మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థగా పని చేయ డం లేద ని మండిపడ్డారు.

బిహార్ ఎస్ నిలుపుదల చేయాలని సుప్రీం కోర్టులో  సిపిఐ తరపున స్వయంగా తాను పిటిషన్ దాఖలు చేసినట్టు రాజా వెల్లడించారు. ఉప రాష్ర్టపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డికి లౌకిక పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీర తెలంగాణ గడ్డపై మతోన్మాద బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి కేవలం వామపక్ష పార్టీలకే ఉందని సిపిఐ సీనియర్ నాయకు లు,

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధులు కందిమళ్ల ప్రతాపరెడ్డి పిలుపుని చ్చారు. అమరవీ రుల ఆశయాలల స్ఫూర్తితో వామపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు కదలాలని ఏటుకూరి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ, సయ్యద్, సిపిఐ(ఎం) రాష్ర్ట కార్యద ర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఆంధ్రప్రదేశ్  రాష్ర్ట కార్యదర్శి కె రామకృష్ణ, సౌహార్ధ, సిపిఐ రాష్ర్ట కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాం బశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మనటుడు డాక్టర్ మాదాల రవి తదితరులు పాల్గొన్నారు.