21-08-2025 12:08:39 AM
దోపిడీ చేస్తున్న యాజమాన్యాలు
కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టియుసిఐ కామారెడ్డి మొదటి జిల్లా మహాసభ రామారెడ్డి మండల కేంద్రంలో ముదిరాజ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతి థిగా బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన వేతన ఒప్పందం తేదీ 30 4వ నెల 2024 తో ముగిసింది.
ఈ కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి పెరిగిన ధరలను తట్టుకొని జీవనం కొనసాగించాలంటే వేతనాలు పెరగాలి తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. అందులో కామారెడ్డి జిల్లాలో సుమారు 60 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు ఇతర పరిశ్రమల కార్మికుల వేతనాల కంటే అతి తక్కువగా బీడీ కార్మికుల వేతనాలు ఉన్నాయి అన్నారు. ఈ పరిశ్రమలో బీడీలు చుట్టే కార్మికులకు చేతినిండా పనిలేదు రోజు సగం పని మాత్రమే దొరుకుతుంది. కొన్ని బీడీ ఫ్యాక్టరీలలో నాలుగు రోజుల నుండి పది రోజుల లోపు గానే పని దినాలు ఇస్తున్నారన్నారు.
అదేవిధంగా బీడీ ప్యాకింగ్ చేసే బీడీ ప్యాకర్లకు ఉత్పత్తి తగ్గడం వల్ల చేతినిండా పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారని వారు అన్నారు వయసు నుండి ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ 600 నుండి 1000 లోపు గానే వస్తుంది బీడీ రంగంలో పనిచేసే అన్ని కేటగిరీలకు చెందిన కార్మికుల కుటుంబం గడవడం చాలా భారంగా మారిందన్నారు కనీస వేతనాలు చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలను సవరించి జీవో విడుదల చేయాలన్నారు.
కానీ దశాబ్దాలు గడిచిన జీవోలు విడుదల చేయడం లేదు 2010 సంవత్సరంలో 32 రోజులు బీడీ కార్మికులు సమ్మె చేస్తే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 41ని విడుదల చేసి ఏజమాన్యాల ఒత్తిడికి తలకి జీవన్ అమలు చేయకుండా పెండింగ్ పెడుతూ జీవో నెంబర్ 81ని విడుదల చేశారు మన రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు వ్యవసాయ కూలీలకు మట్టి పని చేస్తున్న కూలీలకు సైతం ప్రతిరోజు 500 రూపాయలకు తక్కువ కాకుండా కూలి ఇస్తున్నారు నైపుణ్యంతో పనిచేసి బీడీలు చుట్టే కార్మికులకు వేయి బీడీలకు 200 రూపాయలు దాట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు బీడీ కార్మికులు ఆందోళనలు చేసి కార్మిక సంఘాలతో ఒత్తిడి చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆరా కొరగా కొంత వేతనాలు అగ్రిమెంట్ ద్వారా పెంచుకుంటున్నారు.
తప్ప రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం లేదు బీడీ కార్మికులకు కనీస వేతనాలను ధరలను అనుగుణంగా సవరించి జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది బీడీ కార్మికులకు చేతినిండా పని కనీసం రోజుకు 1000 బీడీల చొప్పున నెలకు 26 రోజుల పని దినాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు చెప్పిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా ఆంక్షలు లేకుండా చేయూత పథకం ద్వారా ప్రతి ఒక్కరికి జీవన భృతి నెలకు 4000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేకపోతే కార్మిక లోకాన్ని పెద్ద ఎత్తున ఏకం చేసి ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.