21-08-2025 01:48:51 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం సందర్భంగా పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలను అందజేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ దాసరి చెన్నప్ప ఆధ్వర్యంలో ‘టాలెంట్ మానేజ్మెంట్ అన్ ఎంపిరికల్ స్టడీ అఫ్ టాలెంట్ రేటెన్షన్ స్ట్రాటెజిస్ ఇన్ సెలెక్ట్ ఫార్మసిటికల్ కంపెనీస్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించినందుకు ముంగనూర్‌వాసి ఇటికల రాఘవ చైతన్య డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
యూనివర్సిటీ చాన్సలర్, రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ వి నారాయణన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొగలారం చేతుల మీదగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు.