21-08-2025 01:50:13 AM
-పరిశ్రమలను ఆకర్షించే విధంగా రూపకల్పన
-54 వేల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల ఉద్యోగాలు-
-ఏసియా లైఫ్ సెన్సెస్ రాజధానిగా తెలంగాణ
-ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): త్వరలో తెలంగాణ నెక్ట్స్‌జెన్ లైఫ్ సెన్సైస్ పాలసీని ప్రకటిస్తామని, పరిశ్రమలను పెద్దఎత్తున ఆకర్షించే అత్యుత్తమ విధా నంగా రూపొందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బుధవా రం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ లైఫ్ సెన్సైస్ ఫౌండేషన్ ఆరో బోర్డు సమావేశానికి చైర్మన్ హోదాలో ఆయన అధ్యక్షత వహించారు.
బోర్డు సభ్యులు డా.రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్‌రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ, సీఈ ఓ డా. సత్యనారాయణ చావ, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, శక్తి నాగప్పన్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో లైఫ్ సెన్సైస్ రంగం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. డిసెంబ రు 2023 నుంచి ఇప్పటిదాకా ఈ రంగంలో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు సాధించి గ్లోబర్ లీడర్‌గా ఎదిగిందని తెలిపారు.
లైఫ్ సెన్సెస్‌లో భాగమైన ఔషధ తయారీ, మెడికల్ టెక్నాలజీ, టీకాల ఉత్పత్తి రంగాల్లో కొత్త గా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు సృష్టించగలిగామని వివరించారు. ప్రపంచంలోని అతిపెద్ద 7 లైఫ్ సెన్సైస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలబడిందని, దేశంలో ఈ ఘనత సాధించిం చిన ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని సంతోషం వ్యక్తం చేశారు.
2030 నాటికి రాష్ర్ట లైఫ్ సెన్సైస్ ఆర్థిక వ్యవస్థను 250 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాల ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు పేర్కొన్నారు. దీనితో ఏసియా లైఫ్ సెన్సెస్ రాజధానిగా తెలంగాణ శిఖరాగ్రానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించాలని సూచించారు.
రోల్ మోడల్‌గా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రజల కు మెరుగైన సేవలను వారి ముంగిటకు చేర్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశా రు.
హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించి తమ చిత్తశుద్ధిని ని రూపించుకున్నామని వెల్లడించారు. నగరవాసులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు కృషి చేస్తున్నామని, ఆ దిశ గా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో రిజిస్ట్రేషన్ సేవలను సరళీకృతం చేసేందుకు నిరం తరం కృషి చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ ఇతర రాష్ట్రాలకు రో ల్ మోడల్‌గా నిలిచేలా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.