30-08-2025 09:33:25 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం రాత్రి జిల్లాలోని గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి హడలెత్తించారు. గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. స్టడీ అవర్ లో ఉన్న విద్యార్థులను వివిధ పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డైట్ మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, చదువుతోపాటు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.