10-07-2025 12:51:16 AM
నిజామాబాద్, జూలై 9 (విజయ క్రాంతి): ఎడపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 833 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ దత్తాత్రేయ తెలుపగా, దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ ఆరా తీశారు.
వచ్చిన అర్జీలను ఆయా కేటగిరీల వారీగా విభజిస్తూ ఆన్లైన్ లో వెంటదివెంట అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను కూడా వెంటవెంటనే పరిశీలిస్తూ, అర్హులైన వారికి మంజూరీలు తెలుపాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయంలోని పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు.