10-07-2025 12:52:56 AM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
బోయినిపల్లి :జూలై 9(విజయక్రాంతి) కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విలువలు విజ్ఞానంతో కూడిన బోధన చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. బుధవారం ఆయన బోయినిపల్లి కస్తూర్బా పాఠశాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు రోజువారి అందిస్తున్న భోజనం టిఫిన్ స్నాక్స్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పంట గదిలోకి వెళ్లి వంట ఏ విధంగా చేస్తున్నారని ఏ ఏ రోజు ఏం ఏం వంట చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పాఠశాల తరగతులకు వెళ్లి అన్ని క్లాసులను పరిశీలించి విద్యా బోధన పాఠ్యాంశాలు సబ్జెక్టుల వారిగా ఎక్కడికి వరకు బోధించారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానం అడిగి తెలుసుకున్నారు.
అనంతల ఆయన విద్యార్థులకు విద్యాబోధన కూచేశారు. కస్తూర్బా పాఠశాలలో పైన అదనంగా నిర్మించే తరగతి గదులు ఇంటర్మీడియట్ వారి కోసం నిర్మాణం చేసే గదుల కోసం రూపాయలు ఎనిమిది లక్షలతో నిర్మాణం చేసే గదులను అంచనా నివేదికను తయారు చేయాలని పంచాయతీరాజ్ ఈఈ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీవో జయశీల, ప్రత్యేక అధికారిని లింగవ్వ, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.