10-10-2025 01:05:23 AM
* సమాచార హక్కు నిర్వహణలో జిల్లాకు ద్వితీయ స్థానం
* గవర్నర్ చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న కలెక్టర్
మెదక్, అక్టోబర్ 9 (విజయక్రాంతి):సమాచార హక్కు చట్టం వారోత్సవాలను గురువారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించగా జిల్లా ఉత్తమ ప్రతిభ, ఉత్తమ పీఐవో, ఆర్టీఐ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించిన ఉత్తమ శాఖ తదితర ఏడు విభాగాల్లో పురస్కారాలను ప్రధానం చేశారు.
ఈ క్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా ద్వితీయ అవార్డును అందుకున్నారు. ఆర్టీఐ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పెండింగ్ లేకుండా వ్యవహారిస్తున్నందుకు గాను ఉత్తమ ప్రతిభ జిల్లా అవార్డుకు మెదక్ జిల్లా ఎంపికైనందున కలెకట్ ఈ అవార్డును తీసుకున్నారు.
మెదక్ జిల్లాకు వివిధ అంశాల్లో అనేక అవార్డులు వస్తున్నందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దిశా నిర్దేశంలో వివిధ శాఖల అధికారులుగా పని చేయడం గర్వంగా ఉందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.ఎప్పటికప్పుడు ఆర్టీఐ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, పౌరులు అడిగిన సమాచారాన్నిగడువు లోపల ఇస్తున్నారా లేదా అని కలెక్టర్ రివ్యూ చేసేవారని ఈ సందర్బంగా అధికారులు చెప్పారు.