10-07-2025 12:00:00 AM
- నందనవనం హైస్కూల్ విద్యార్థుల వినతి
- 600 మంది విద్యార్థులకు 14 మంది ఉపాధ్యాయులు
- ఎస్జీటీ టీచర్లే... హైస్కూల్ విద్యార్థులకు విద్యాబోధన
- కనిపించని స్కూల్ అసిస్టెంట్ టీచర్లు
- విద్యార్థులకు సరిపడా లేని తరగతి గదులు
ఎల్బీనగర్, జులై 8 : పేద విద్యార్థులు చ దువుకునే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. పేరుకే ప్రభుత్వ ఉన్నత పాఠశాల... ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులే.. హైస్కూల్ వి ద్యార్థులకు కూడా విద్యా బోధన చేస్తున్నారు.
సబ్జెక్టు ఉపాధ్యాయులు (స్కూల్ అసిస్టెంట్లు) లేకపోవడంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య లభించడం లేదు. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా... సరిపడా తరగతి గదులు లేవు. హస్తినాపురం డివిజన్ లోని నందనవనం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది.
- విద్యార్థులు ఉన్నా... ఉపాధ్యాయులు లేరు
నందనవనం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనేక మంది పేద విద్యార్థులు చదువు కుంటున్నారు. ప్రతి ఏడాది విద్యార్థుల సం ఖ్య పెరుగుతున్నా సరిపడా ఉపాధ్యాయులు లేరు. 2025_26 విద్యాసంవత్సరం లో మొత్తం 600 మంది(310 మంది బాలురు, 290 మంది బాలికలు) విద్యార్థు లు చదువుతున్నారు. వీరందరికీ కేవలం 14 (ప్రధా నోపాధ్యాయుడు, 13 మంది టీచర్లు) మంది టీచర్లు విద్యా బోధన చేస్తున్నారు. ఇందులో ఇద్దరు టీచర్లు డిప్యూటేషన్ పై వచ్చారు.
వి ద్యార్థుల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేశారు. అయితే, ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయులు (ఎస్జీటీ) ఉన్నత తరగతులు చదువుతున్న విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్క స్కూ ల్ అసిస్టెంట్ టీచర్ లేరు. దీంతోపాటు క్రీడ ల్లో శిక్షణ ఇచ్చే పీడీ లేదా పీఈటీ లేరు. వి ద్యార్థులను ఆటలు ఆడించి, వారిలో క్రీడా నై పుణ్యాలను వెలికి తీసే ఉపాధ్యాయుడు లేకపోవడంతో ప్రతిభావంతులు వెలుగులో కి రాలేక పోతున్నారు.
పాఠశాలను సరైన దారిలో పెట్టాల్సిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు లేరు. హైస్కూల్ విద్యార్థులకు తెలు గు, హిందీ పండిట్లతోపాటు మాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్, సోషల్ సబ్జెక్లు విద్యాబోధన చేయడానికి 10 మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లు కావాలి. అదనపు, సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు ఎంఈవో, డీఈవో, కలెక్టర్‌కు ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు వినతి పత్రాలు అందజేశారు.
వేధిస్తున్న తరగతి గదుల కొరత
600 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేవు. ప్రధా నోపాధ్యాయుడు ప్రభాకర్ రావు పలువురు దాతలను కోరడంతో అదనపు తరగతి గదు లు నిర్మాణాన్ని చేపట్టారు. ఇవీ కూడా అసంపూర్తిగా మిగిలాయి. పాఠశాల దుస్థితి తెలు సుకున్న సినీ నిర్మాత సూర్యనారాయణ సొంత నిధులతో అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు ప్రారంభించారు. మరికొం త మంది దాతల సహకారంతో పూర్తి స్థాయి లో తరగతి గదులు నిర్మిస్తామని ఆయన హా మీ ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ రావు పేర్కొన్నారు.
- ప్రజావాణిలో ఎంపీ ఈటల రాజేందర్ ఫిర్యాదు
నందనవనం హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ టీచర్లను నియమించాలని ప్రజావాణి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. నందనవనం ఉన్నత పాఠశాలకు స్కూల్ అ సిస్టెంట్ టీచర్లను నియమించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.. ప్రజావాణి లో రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డిని కో రారు. నందనవనం పాఠశాల హైస్కూల్ స్థాయికి అప్ గ్రేడ్ అయినా సబ్జెక్టుల బోధన కు స్కూల్ అసిస్టెంట్ల లేరని తెలిపారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు మాత్రమే ఉన్నారని, హై స్కూల్ విద్యార్థులకు గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.
సబ్జెక్టు టీచర్లు లేరు
నందనవనం హైస్కూల్ లో సబ్జెక్టు టీచర్లు లేరు. ముఖ్యంగా తెలుగు, హిందీ, సైన్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, మాథ్స్ ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠాలు అర్దం కావడం లేదు. ఆటలు ఆడించడానికి పీఈటీ సార్ లేరు. సరిపడే తరగతి గదులు సైతం లేవు. ప్రభుత్వం వెంటనే మా స్కూల్ కు టీచర్లను నియమించాలి.
విద్యార్థులు వాణి, అక్షయ్