calender_icon.png 10 July, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 4 రోజుల పాటు వర్షాలు

10-07-2025 12:01:51 AM

హైదరాబాద్ (విజయక్రాంతి): రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైద్రాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ(India Meteorological Department) వెల్లడించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల పరిధిలో శుక్ర, శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.